Hyderabad, జూలై 11 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రెగ్నెన్సీ కాదని రోహిణి చెప్పడంతో ప్రభావతి చాలా నిరాశపడుతుంది. ఇలా చేశావేంటమ్మా అని ప్రభావతి అంటుంది. అందుకే కీడెంచి మేలెంచమ్మన్నారు అని సత్యం అంటాడు. ఇంతలో బాలు, మీనా వంటింట్లోకి వెళ్తారు.

నీళ్లలో పసుపు, ఆవాలు మరికొన్ని వేసి కలిపి ఏం అడగకుండా మీనాను తాగమంటాడు బాలు. దాంతో మీనా తాగుతుంది. ఎలా ఉందని బాలు అడిగితే వికారంగా ఉందని, తల తిరుగుతుందని, వాంతి వచ్చేలా ఉందని పరుగెత్తుతుంది మీనా. అవన్నీ గట్టిగా అందరూ వినేలా చెబుతాడు బాలు. ఇక్కడ ఆగింది అక్కడ మొదలైందని కామాక్షి అంటుంది.

అమ్మోయి నా పెళ్లాం తల్లి కాబోతుంది. నాన్న నానమ్మకు ఫోన్ చేసి నా బిడ్డకే ఆస్తి రాయమని చెప్పు. నాకే ముందు బిడ్డ పుట్టబోతుంది అని హడావిడి చేస్తాడు బాలు. నువ్వొకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అని ప్రభా...