భారతదేశం, నవంబర్ 12 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 552వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సుశీల్ 75వ పుట్టిన రోజు సందడి, నగల గురించి ప్రభావతి ఆందోళన, సంజూకి తెలియకుండా పుట్టింటికి వచ్చిన మౌనిక చిక్కుల్లో పడటంలాంటి సీన్లతో సాగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్ బాలు గురంచి మీనాను సుశీల అడిగే సీన్ తో మొదలవుతుంది. ఏదో చాలా ముఖ్యమైన పని ఉంటేనే ఆయన అలా వెళ్తారని ఏదో చెబుతుంది. తర్వాత రెడీ అయి వస్తానని వెళ్తుంది. ఆమెను ప్రభావతి అడ్డుకొని వంట ఎవరు చేస్తారని అడుగుతుంది.

దీంతో సుశీల వెళ్లి నువ్వు ఆడదానివి కావా.. మిగిలిన కోడళ్ల సాయం తీసుకొని నువ్వే వంట చెయ్యు అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత మీనాను నగలు వేసుకోమని సుశీల అడగడంతో ప్రభావతి, మనోజ్ కంగారు పడతారు. తర్వాత ప్రభావతి కిచెన్ లోకి ...