భారతదేశం, నవంబర్ 27 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 563వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎలాగైనా నగల నిజం తెలుసుకోవాలని భావించే బాలు కొత్త ప్లాన్ వేస్తాడు. పార్కు ఫ్రెండ్ ను ఆరా తీయడంతోపాటు మంత్రించిన నిమ్మకాయ అంటూ కొత్త డ్రామా మొదలుపెడతాడు. దీంతో మనోజ్, ప్రభావతి దొరికిపోతారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (నవంబర్ 27) ఎపిసోడ్ మౌనిక విషయంలో బాలు బాధపడటం, అతన్ని మీనా ఓదార్చే సీన్ తో మొదలవుతుంది. మీరు ఏ తప్పూ చేయలేదని, మౌనికను కూడా సంజూ ఏమీ అనలేదని బాలుతో చెబుతుంది.

దీంతో ఆ విషయం పక్కన పెట్టే బాలు మరోసారి నగల గురించి ఆలోచిస్తాడు. అది కచ్చితంగా మనోజ్ గాడే తీశాడని, ఈ విషయం తెలుసుకోవడానికి పార్క్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాల్సిందే అని అంటాడు. తాను అసలు విషయం తెలుసుకొని వస్తానని వెళ్తాడు.

మనోజ్ పార్క్ ఫ్రెండ్ మణికంఠ దగ్గరకు బాల...