భారతదేశం, నవంబర్ 14 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు బయట మందు తాగుతున్నాడని మనోజ్ అంటే.. ఆయన ఎందుకు బయటకు వెళ్లాలో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఇక్కడే నేనే అని ఆగిపోతుంది మీనా. ఎక్కడికి వెళ్లాడని సుశీల అంటే వస్తారని మీనా అంటుంది. అన్నయ్య కూడా గిఫ్ట్ కొనడానికి వెళ్లినట్లున్నాడు అని రవి అంటాడు.

పుట్‌పాత్ మీద దొరికే 500న గిఫ్ట్‌ను 200లకు బేరాలు ఆడి తీసుకొస్తాడు అని అవమానిస్తాడు మనోజ్. అత్తింటి సొమ్ముతో షాప్ పెట్టుకున్న మీరు కూడా మాట్లాడుతున్నారే. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తానాను నీ భార్యకు ఏనాడైనా మూరెడు మల్లెపూలు కొన్నారా అని మీనా అంటుంది. అది మా పర్సనల్ అని రోహిణి అంటే.. మరి నా మొగుడు గురించి అనడం ఎందుకని మీనా అంటుంది.

కరెక్టే కదా. భర్తను అంటే ఎవరైనా అంటారు. అందరూ అత్తయ్యలా మావయ్యను ఏమన్నా చూస్తు ఉన్నట్లు ఉ...