Hyderabad, అక్టోబర్ 14 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఈ ఊరివాళ్లను నమ్ముకుని డ్యాన్స్ స్కూల్ పెట్టుకున్నందుకు నాది బుద్ధి తక్కువ అని ప్రభావతి వెళ్లిపోతుంటే.. కనీసం టిఫిన్ అయిన తినండి అని మీనా అంటుంది. ఏమొద్దు. నువ్వే నూనే పోసి వత్తి పెట్టావ్‌గా ఇలా జరగాల్సిందే అని ప్రభావతి వెళ్లిపోతుంది. కోపంలో అన్నది ఫీల్ అవ్వకు అని సత్యం వెళ్తాడు.

ఈ విషయం మనం ఏం చేయగలం అని మీనా అంటుంది.. నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక రాయి వేసి చూద్దాం అని బాలు అంటాడు. మరుసటి రోజు ఉదయం ప్రభావతి డ్యాన్స్ స్కూల్‌లో ఈగలు తోలుకుంటూ ఉంటే కామాక్షి వచ్చి సెటైర్లు వేస్తుంది. నేను చీటి పాడేవారికి చెప్పాను. వారిని ముగ్గురికి చెప్పమని చెప్పాను. పొద్దున ఒక బ్యాచ్, రాత్రి ఒక బ్యాచ్‌ను పిలవొచ్చు అని కామాక్షి అంటుంది.

ఇంతలో మీనా, బాలు తాంబూలం తీసుకుని వస్తారు. వీళ్...