భారతదేశం, నవంబర్ 19 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 557వ ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. నగల విషయంలో ప్రభావతి బుకాయించినా.. చివరికి మనోజ్ నిజ స్వరూపాన్ని బాలు బయటపెట్టడంతో సత్యం అతని చెంప పగలగొడతాడు. దీంతో ప్రభావతి కూడా దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (నవంబర్ 19) ఎపిసోడ్ లో నగల గురించి ప్రభావతి దబాయించే సీన్ తో మొదలవుతుంది. తన పుట్టింటి వాళ్లపై నింద వేయడంతో మీనా ఆవేశంగా ప్రభావతి, మనోజ్ లను తిడుతుంది. మరొకరి సొమ్ముకు ఆశపడే బుద్ధి తన పుట్టింటి వాళ్లకు లేదని, తండ్రి, తమ్ముడి సొమ్ము మింగే అలవాటు లేదని పరోక్షంగా మనోజ్ ను మీనా తిడుతుంది.

మీ ఆయనకు కారును ఆ బంగారం అమ్మే కొనుంటావని రోహిణి అంటే.. శృతి అడ్డుపడి ఆమెను తిడుతుంది. పోలీసులును పిలుద్దాం అంటుంది. దీంతో మనోజ్ భయపడత...