భారతదేశం, నవంబర్ 4 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 546వ ఎపిసోడ్ లో బాలు, మీనాల చేతిలో అడ్డంగా బుక్కవుతుంది ప్రభావతి. నకిలీ నగలు ఆమె కొంప ముంచుతాయి. వాటిని తాకట్టు పెట్టడానికి వెళ్లిన బాలు, మీనాలకు ఘోర అవమానం జరుగుతుంది. అయితే ఆ తర్వాత ఇంట్లో అసలు రచ్చ జరిగే ప్రమాదం కనిపిస్తుంది.

గుండె నిండా గుడి గంటలు మంగళవారం (నవంబర్ 4) ఎపిసోడ్ లో బాలు, మీనా కలిసి బామ్మ పుట్టిన రోజుకు గోల్డ్ చెయిన్ చేయించాలని నిర్ణయించుకుంటారు. అయితే డబ్బు లేదని, అప్పు చేయాల్సిందే అని బాలు అంటాడు. మిమ్మల్ని, నన్ను అంత బాగా చూసుకునే బామ్మ కోసం అప్పు చేసినా సరే అని మీనా అంటుంది. దీంతో అప్పు కోసం బాలు బయటకు వెళ్తాడు. కానీ ఎవరూ అతనికి డబ్బు ఇవ్వరు.

దీంతో బాలు నిరాశగా తిరిగి ఇంటికి వస్తాడు. ఎవరూ అప్పు ఇవ్వడం లేదని, కారు తాకట్టు పెట్టమంటున్నారని చెబుతాడు. దీంతో మీనా కూడ...