భారతదేశం, జనవరి 27 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 606వ ఎపిసోడ్ లో అత్త ప్రభావతితో ఓ ఆట ఆడుకుంటుంది శృతి. దీంతో ఆమె ప్రవర్తనకు విసిగి వేసారిపోయిన ప్రభావతి.. ఆమె తల్లి శోభకు చెబుతుంది. మీనాకు దూరంగా ఉండమంటుంది. ఇదే అదునుగా గొడవ పెద్దది చేయడానికి ఆమె ప్లాన్ చేస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (జనవరి 27) ఎపిసోడ్ సుమతిని డాక్టర్ మందలించే సీన్ తో మొదలవుతుంది. ఉద్యోగం నుంచి తీసేశామని అంటుంది. దీంతో సుమతి ఆమెను వేడుకుంటుంది. అయితే ఇదే చివరి వార్నింగ్ అంటూ ఈ నెల సగం జీతం మాత్రమే ఇస్తామని చెబుతుంది. నీ వల్ల మేము లక్షలు కోల్పోయాం.. నువ్వు వేలు కూడా నష్టపోకపోతే డబ్బు విలువ తెలియదంటుంది. జాబ్ కాపాడుకోవడం కోసం సుమతి సరే అంటుంది.

ఇటు పెళ్లికి పెద్ద పూల ఆర్డర్ వచ్చిందని మీనా దగ్గరికి బస్తీ వాళ్లు వస్తారు. కానీ మా ఆయన వస్తే ...