భారతదేశం, నవంబర్ 28 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 564వ ఎపిసోడ్ లో బాలు ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నిమ్మకాయను చూసి కంగారు పడిపోయి ఏదేదో ఊహించేసుకున్న మనోజ్, ప్రభావతి.. చివరికి దొంగతనాన్ని అంగీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మనోజ్ ను బాలు, సత్యం చితకబాదుతారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (నవంబర్ 28) ఎపిసోడ్ మీనాకి బాలు నిజం చెప్పే సీన్ తో మొదలవుతుంది. ఆ స్వామీజీ తానేనని, వాళ్లతో నిజం చెప్పించడానికి ఇలా చేశానని అంటాడు. అటు బాలు నిమ్మకాయ దెబ్బకు మనోజ్, ప్రభావతి భయంతో వణికిపోతారు.

తమకు కాళ్లు, చేతులు పడిపోయినట్లు ఊహించేసుకుంటారు. దీంతో రోహిణి వచ్చి వాళ్లకు ధైర్యం చెబుతుంది. మీరు బాగానే ఉన్నారని, బాలు కావాలని ఇదంతా చేస్తున్నాడని అనడంతో ప్రభావతి వెళ్లిపోతుంది. కానీ మనోజ్ మాత్రం భయపడుతూనే ఉంటాడు.

ఇటు శృతి కూడా తన స...