Hyderabad, జూలై 22 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (జులై 22) 471వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ ఎపిసోడ్ అంతా ఫన్నీగా సాగింది. తల్లిదండ్రులకు శృతి క్లాస్ పీకుతుంది. ఇటు మనోజ్ ను బాలు, మీనా బలవంతంగా ఇంటికి తీసుకురాగా.. అతన్ని చూసి ప్రభావతి షాక్ తింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఈ ఎపిసోడ్ శృతి తల్లిదండ్రులు శోభ, సురేంద్ర తమ అల్లుడు రవి గురించి మాట్లాడుకునే సీన్ తో మొదలవుతుంది. తమ అల్లుడిని తమ దగ్గరే పెట్టుకొని వ్యాపారం పెట్టిద్దామనుకొని ప్లాన్ చేస్తే.. అతడు వర్కర్స్ దగ్గర ఉంటున్నాడేంటి అని సురేంద్రతో అంటుంది శోభ. అల్లుడిగారి మనసు మారిపోయి శృతిని తీసుకెళ్తే ఎలా అంటుంది. అలా ఏమీ జరగదులే అని సురేంద్ర చెబుతాడు.

ఇంతలో శృతి ఇంటికి వచ్చి ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపోతుంది. ఏం జరిగిందో అని కంగారుగా వాళ్లు ఆమె దగ్గరికి వ...