Hyderabad, సెప్టెంబర్ 23 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 516వ ఎపిసోడ్ కాస్త సరదాగా, మరికాస్త సీరియస్ గా సాగిపోయింది. రూమ్, వంట విషయంలో మీనా, ప్రభావతి మధ్య మరోసారి వాదన.. అటు కొడుకు కోసం హాస్పిటల్ కు వెళ్లిపోయి బాలుకు అడ్డంగా దొరికిపోయిన రోహిణి సీన్లు ఆసక్తి రేపుతాయి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ మనోజ్ ను బాలు కథలతో ఏడిపించే సీన్ తో మొదలవుతుంది. మనోజ్, బాలు, సత్యం ఒకే గదిలో పడుకుంటారు. కింద పడుకున్న బాలు.. మనోజ్ కు నిద్ర లేకుండా చేయాలని అనుకుంటాడు.

చిన్న కథ చెబుతానంటూ మొదలు పెట్టి వరుసగా కథలు చెబుతూ అతనికి నిద్ర లేకుండా చేస్తాడు. పేదరాసి పెద్దమ్మ, రూ.40 లక్షల గారె, ఓ కాకి అంటూ అతనిపైనే సెటైర్ వేసేలా కథ చెప్పడంతో మనోజ్ ఫీలవుతాడు.

అటు ప్రభావతి, మీనా, రోహిణి ఒకే గదిలో పడుకుంటారు. ఆ పూలమ్మకునే...