Hyderabad, ఆగస్టు 1 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రౌడీయిజం చేసి డబ్బు సంపాదించడాని, ఇలాంటి వాడు ఇంట్లో ఉండకూడదని బాలును గెంటేయాలని చూస్తుంది తల్లి ప్రభావతి. ఇంతలో బాలు సహాయం చేసిన పెద్దాయన వచ్చి ఇలాంటి కొడుకును కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు అని, దేవుడు అంటూ పొగుడుతాడు.

దాంతో ప్రభావతితోపాటు అంతా షాక్ అవుతారు. రౌడీలను తరిమేయడానికి డబ్బులు తీసుకోలేదా. కిరాయి కింద దేవుడితో మాట్లాడుకోలేదా అని ప్రభావతి అడిగితే.. లేదమ్మా అని జరిగింది చెబుతాడు పెద్దాయన. మరి డబ్బు గురించి ప్రభావతి అడిగితే.. మీ అబ్బాయి చాలా అభిమానవంతుడమ్మా. డబ్బులిస్తానన్న తీసుకోలేదు. నేను చెల్లెలికి అన్నకు పెట్టే కట్నం పెట్టుకోమని ఇచ్చా. దేవుడి హుండిలో వేసేది కానుకే గానీ కిరాయి కాదమ్మా. కృతజ్ఞత అని పెద్దాయన అంటాడు.

దాంతో ప్రభావతి తన తప్పు తెలుసుకుంటుం...