Hyderabad, అక్టోబర్ 8 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 527వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు తనపై చూపించిన ప్రేమకు మీనా పొంగిపోవడం, అటు తమ జోలికి రావద్దని శివ, గుణలకు క్లాస్ పీకడం.. ఇటు రోహిణిని దినేష్ మళ్లీ వేధించడం చూడొచ్చు. చివరికి చంద్రముఖిలా మారిన ప్రభావతి కొత్త డ్యాన్స్ స్కూల్ పెట్టడమనే ట్విస్ట్ అదిరిపోయింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ అత్త ప్రభావతికి మీనా క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. అసలు విషయం తెలియకుండా పని తప్పించుకోవడానికి వెళ్లి రాత్రికి వచ్చిందని అనడంతో మీనా సీరియస్ అవుతుంది. పని చేయడానికే వెళ్లానంటూ రూ.3 వేలు చూపిస్తుంది. ఇప్పటికైనా మీనాను అర్థం చేసుకోమంటూ కామాక్షి కూడా ప్రభావతికి చెబుతుంది.

అటు మనోజ్ అంతా టైమ్ వేస్ట్ అని అనడంతో బాలు జోక్యం చేసుకుంటాడు. ఒకప్పుడు నీ పెళ్లాం ...