భారతదేశం, జనవరి 14 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాబురావు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి గుణ, శివ డబ్బు కోసం దాదాగిరి చేస్తారు. బాలు కారులోనే బాబురావు వస్తాడు. బాబురావు కారులో బ్యాగ్ మర్చిపోవడంతో బాలు తీసుకు వస్తాడు. మరోవైపు వడ్డీ సరిగ్గానే కడుతున్నా కదా ఇంటికి ఎందుకు వచ్చావని గుణను బాబురావు అడుగుతాడు.

సరిగ్గానే కడుతున్నావ్. కానీ, అర్జంట్‌గా 50 వేలు అవసరం పడింది ఇవ్వు అని గుణ అంటాడు. ఉన్నపలంగా ఎలా ఇవ్వను. సంవత్సరం వరకు డబ్బు అడగను అన్నావ్. ఇప్పుడు అడగడం న్యాయంగా ఉందా అని బాబురావు అంటాడు. అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఉంది. ఏం చేసైనా సరే డబ్బు ఇవ్వు. అప్పటివరకు మీ ఆవిడ చేసిన వంట తింటూ ఉంటా అని గుణ అంటాడు.

ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని బాబురావు అంటాడు. నేనేమైనా మీ ఆవిడను తీసుకెళ్తానా అని అప్పటివరకు అని గుణ అంటుంటే నాలుగు ...