Hyderabad, ఆగస్టు 4 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా స్కూటీ మీద పుట్టింటికి వెళ్తుంది. అది చూసి తల్లి పార్వతి, చెల్లెలు సుమతి సంతోషిస్తారు. పూలు అమ్ముడానికి ఆయన స్కూటీ కొనిపెట్టారని చెబుతుంది మీనా. పూలకొట్టు గురించి అడిగితే జరిగింది చెబుతుంది మీనా. బాలుకు తొందరకోపం వస్తుంది. కానీ కారణం లేకుండా ఎందుకు వస్తుంది. మీ తమ్మున్ని కొట్టారని మేము బాలును అన్నాం అని పక్కంటి ఆవిడ అంటుంది.

ఇంతలో శివ వస్తే బావ కొనిపెట్టారని స్కూటీ చూపిస్తుంది మీనా. ఓసారి నడుపుతావా అని అడుగుతుంది. ఎవరి బండో నేను ముట్టుకోను అని శివ అంటే.. అవును, గుణ బండి మీద అయితే బాగా తిరుగుతావ్ అని సుమతి అంటుంది. దాంతో శివ వెళ్లిపోతాడు. మీనాను ఇంట్లోకి తీసుకెళ్లిన పార్వతి ఎవరి కళ్లు పడ్డాయో అని దిష్టి తీస్తుంది. ఇంతలో శివ వస్తే.. వీడు కాలేజ్‌కు వెళ్తున్నాడా అని...