భారతదేశం, డిసెంబర్ 5 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 569వ ఎపిసోడ్ లో ప్రభావతి కోసం మీనా బాధపడటం, మనోజ్ బదులు తాను డబ్బు ఇస్తానని రోహిణి మాటివ్వడం, అటు గుడిలో మీ బంగారు గాజులు ఏమయ్యాయని ప్రభావతిని శోభ నిలదీయడంలాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 5) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్ కు ఇంట్లో వాళ్లు క్లాస్ పీకే సీన్ తో ఎపిసోడ్ మొదలైంది. నీ వల్లే ఇదంతా జరిగిందని బాలు, సత్యం అతనికి క్లాస్ పీకుతారు. ఇక నువ్వు మారవా.. ఆ ఇద్దరినీ పెంచినట్లే నిన్నూ పెంచాను.. వాళ్లపై ఎప్పుడైనా ఇలా దొంగ అనే ముద్ర పడిందా అంటూ సత్యం అతనిపై మండిపడతాడు.

నాన్నకు ఇవ్వాల్సిన రూ.40 లక్షలు, తనకు ఇవ్వాల్సిన రూ.4 లక్షలు ఇవ్వాల్సిందే అని బాలు అతన్ని అడుగుతాడు. తన భర్తను అందరూ తిడుతుండటంతో రోహిణి రంగంలోకి దిగుతుంది. ఆ డబ్బు తాను ...