భారతదేశం, నవంబర్ 21 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 559వ ఎపిసోడ్ లో బాలు ఇంట్లో మనోజ్ సినిమా చూపిస్తాడు. దీంతో అతడు రూ.4 లక్షలు మోసపోయిన విషయం తెలుస్తుంది. అయితే నగల విషయం బయటపడకుండా మనోజ్ ను చితకబాది అప్పు తీసుకున్నానని చెప్పేలా చేస్తుంది ప్రభావతి. అయినా బాలు వదలకుండా మరో ప్లాన్ వేసి మనోజ్ తో నిజం చెప్పిస్తాడు.

గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (నవంబర్ 21) ఎపిసోడ్ బాలు, రాజేష్ బీరువా కొనడానికి ఓ షాపుకి వెళ్లిన సీన్ తో మొదలవుతుంది. 50 శాతం డిస్కౌంట్ బోర్డు చూసి వెళ్తారు. కానీ అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ఈ ఫర్నీచర్ అంతా దొంగతనం చేసుకొచ్చిందంటూ వాటిని అమ్ముతున్నవారితోపాటు కొనడానికి వచ్చిన బాలు, రాజేష్ లను కూడా పోలీస్ స్టేషన్ ను తీసుకెళ్లి సెల్లో వేస్తారు. తమకు సంబంధం లేదని చెప్పినా వినరు. దీంతో బాలు ఆవేశంతో సెల్లోనే ఆ షాపు నడిపి...