భారతదేశం, జనవరి 15 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో ప్రసాదాల ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తారు. మీనా ఇంకా రాకపోవడంపై శివ కోప్పడుతాడు. మీనాకు కాల్ చేస్తుంది పార్వతి. కచ్చితంగా రావాలా అని మీనా అంటే.. నువ్వేగా వండాలి అని పార్వతి అంటుంది. ఆయన రానన్నారు అని మీనా చెబుతుంది.

నువ్వు వస్తేనే శివ ఉంటానంటున్నాడు అని శివకు ఫోన్ ఇస్తుంది పార్వతి. మీ ఆయన రావద్దంటున్నాడా. నువ్వు వస్తేనే నేను ఉంటా. లేకపోతే వెళ్తా. నాకోసం ఎవరు ఆపిన ఆగొద్దు అని శివ కాల్ కట్ చేస్తాడు. మరోవైపు మీనాతో శ్రుతి చెబుతుంది. శివ పుట్టినరోజు, ప్రసాదాలు పంచిపెట్టడం గురించి, బాలు వద్దనడం గురించి చెబుతుంది మీనా.

నీ పుట్టింటికి వెళ్లడానికి బాలు పర్మిషన్ కావాలా. పుట్టింటి వాళ్లను బాధపెట్టడం ఇష్టం లేదనుకుంటే వెళ్లు అని శ్రుతి అంటుంది. దాంతో మీనా వెళ్లడానికి రెడీ అవ...