Hyderabad, అక్టోబర్ 3 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు ఫ్రెండ్ వచ్చి తన అన్న పెళ్లి కార్డ్ ఇస్తాడు. దాంతో మీ అన్న హిందీ అమ్మాయితో లేచిపోతే నీ బతుకు బస్టాండే. నిన్ను బలిచేస్తారు. ఒక్కసారి తాళి కడితే జీవితాంతం వదిలించుకోలేవు అని బాలు అంటాడు. దానికి మీనా బాధపడుతు కిచెన్‌లో ఏడుస్తుంటుంది.

డైనింగ్ టేబుల్ దగ్గర మీనాను ఇప్పటికీ అంటగట్టినట్లే మాట్లాడాడు అని ప్రభావతి అంటుంది. అబ్బో కేక్‌లు, పెళ్లి రోజులు చేసుకున్నారు. వాళ్ల నాన్నకు భయపడి బలవంతంగా కాపురం చేస్తున్నాడట. ఇన్నిరోజులకు నిజం బయటపెట్టాడు అని ప్రభావతి అంటుంది. దాంతో మీనా మరింత కుంగిపోతుంది. మనోజ్, రోహిణి, ప్రభావతి నవ్వుకుంటూ వెళ్లిపోతారు.

తర్వాత మీనా దగ్గరికి బాలు వస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది. మనోజ్ టిఫిన్ గురించి అడిగితే.. మీ భార్యను అడుక్కోండి గుడిమెట్ల ...