భారతదేశం, అక్టోబర్ 29 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 542వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఓవైపు బాలు, మీనా తమ గది కోసం పైసా పైసా జోడిస్తుండగా.. మరోవైపు దొంగల చేతిలో నిండా మునిగి కాపాడమంటూ తల్లి ప్రభావతి కాళ్ల మీద పడతాడు మనోజ్. ఈ ఎపిసోడ్ లో అదే పెద్ద ట్విస్ట్ గా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (అక్టోబర్ 29) ఎపిసోడ్ శృతికి రవి నెయిల్ పాలిష్ పెట్టడం ప్రభావతి చూసి వాళ్లను మందలించే సీన్ తో మొదలవుతుంది. ఇలా చేయడం తప్పు అంటూ శృతికి ప్రభావతి చెబుతుంది. భర్తను గౌరవించాలి.. ఇలా కాళ్లు పట్టించుకోవద్దని అంటుంది. కానీ శృతి మాత్రం ఇందులో తప్పేముంది.. కావాలంటే మీరు కూడా అంకుల్ తో నెయిల్ పాలిష్ పెట్టించుకోండి అని అనడంతో ప్రభావతి షాక్ తింటుంది. నీకైనా బుద్ధి ఉండాలి కదా అని రవిని తిట్టి ప్రభావతి వెళ్...