Hyderabad, జూలై 21 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఫంక్షన్‌లో సురేంద్ర చేసిందంతా శ్రుతికి చెబుతాడు బాలు. కానీ, ఇందులో రవి తప్పు ఏం లేదుగా. నా మీద మనసులో కోపం పెట్టుకో కానీ వాడి మీద ఎందుకు అని రవి పరిస్థితి చెబుతాడు బాలు.

మీనా చూడు ఎన్ని కష్టాలు వచ్చిన వదిలి వెళ్లిపోయిందా. పూలు అమ్ముకుని బతకొచ్చుగా ఎందుకు వెళ్లలేదు. నేను నా జీవితంలో ఇంత కుదురుగా మాట్లాడింది ఇప్పుడే. మా అన్నదమ్ములను ఏడిపిస్తాను. కానీ, వాళ్లు ఏడిస్తే చూడలేను. నీ గురించి, రవి గురించి ఆలోచించి మా అమ్మ నాన్న సరిగా తినడం లేదు. అది కూడా ఆలోచించు అని ఎమోషనల్‌గా అల్లాడించేస్తాడు బాలు.

మరోవైపు స్వామిజీని కలుస్తాడు మనోజ్. మీరు ఏదోటి చేసి ఇతనికి జాబ్ వచ్చేల చేయమని మనోజ్ పార్క్ ఫ్రెండ్ చెబుతాడు. కానీ, దానికి ముందు నేను కొన్ని ప్రశ్నలు అడగాలని మనోజ్ అడుగుతాడు. మీ క...