Hyderabad, జూలై 16 -- స్టార్ మా సీరియల్ 'గుండె నిండా గుడి గంటలు' బుధవారం (జులై 16) 768వ ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. అసలు నీకు తండ్రి ఉన్నాడా అంటూ ప్రభావతి.. రోహిణిని నిలదీయడం, ఆమె కొత్త డ్రామా మొదలుపెట్టడం, ఇంటిని తాకట్టు పెట్టాలంటూ మనోజ్ ఒత్తిడి చేయడంతో ఈ ఎపిసోడ్ రక్తి కట్టించింది. అసలు ఈరోజు మొత్తం ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ ప్రభావతి.. రోహిణి గదిలోకి వచ్చే సన్నివేశంతో ఆరంభమవుతుంది. రోహిణి తండ్రి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆమెను ఒత్తిడి చేస్తుంది. "మీ నాన్న ఫంక్షన్ రోజు ఎక్కిన ఫ్లైట్ ఇంకా ఆకాశంలో గద్దలాగా తిరుగుతోందా?" అని సెటైర్ వేస్తుంది.

"ఆయనకు నీ మీద ప్రేమ ఉందా? వస్తానని చెప్పి మోసం చేశాడు. కూతురు మీద బాధ్యత లేదా?" అని కోపంగా అడుగుతుంది. "మీ నాన్న రాకపోతే నీ స్థాయి నీకు తెలిసే...