భారతదేశం, డిసెంబర్ 25 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 583వ ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. బెస్ట్ కపుల్ పోటీలో గెలవడానికి సత్యం ఫ్యామిలీలోని జంటలన్నీ గట్టిగానే పోటీ పడతాయి. ఈ క్రమంలో ప్రభావతి తన నడుము విరగ్గొట్టుకోగా.. బాలు, మీనా తమ కలల ఇంటిని కట్టి జడ్జీలను భావోద్వేగానికి గురి చేస్తారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (డిసెంబర్ 25) ఎపిసోడ్ స్టేజ్ పై మీనా తన టాలెంట్ చూపే సీన్ తో మొదలవుతుంది. ఆమె కళ్లకు గంతలు కట్టుకొని మూడు నిమిషాల్లోనే నాలుగు మూరల పూలు అల్లుతుంది. దీంతో అందరూ ఆమెను మెచ్చుకుంటారు.

మీనాను చూసి కుళ్లకునే ప్రభావతి తన టాలెంట్ చూపిస్తానంటూ స్టేజ్ పైకి వెళ్తుంది. భరతనాట్యం చేసి చూపిస్తుంది. ఆమె డ్యాన్స్ కు అందరూ ఫిదా అవుతారు. సత్యం ముసిముసిగా నవ్వుతుంటాడు.

ఆ తర్వాతి రౌండ్ లో మూకాభినయం చేయాల్సి వస్తుంది. జంటలు ఒకరికొక...