భారతదేశం, నవంబర్ 7 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 549వ ఎపిసోడ్ సత్యం తల్లి సుశీల 75వ పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమవడం, తనను మెప్పించిన వాళ్లకు తానూ ఓ గిఫ్ట్ ఇస్తానని సుశీల చెప్పడం, దానికోసం ప్రభావతితోపాటు మనోజ్ కక్కుర్తి పడటంలాంటి సీన్లతో సాగిపోయింది. అయితే బాలు మాత్రం బాధలో బయటకు వెళ్లిపోతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (నవంబర్ 7) ఎపిసోడ్ సుశీల తన 75వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం ఇంటికి రావడంతో మొదలవుతుంది. ఆమెకు అందరూ బర్త్ డే విషెస్ చెబుతారు. ఈ వయసులోనూ ఇంత అందంతో ఎలా మెరిసిపోతున్నారని శృతి ఆమెను అడుగుతుంది. ఇది అందం కాదు.. మీ అందరినీ చూసి సంతోషంతో ముఖం వెలిగిపోవడం అని చెబుతుంది.

ఇక తాను ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమేంటో చెబుతూ ప్రభావతికి చురకలు వేస్తుంది. ఇంట్లో పనులు, పొలం పనులు చేయడం వల్లే తాను ఇలా ఉన్నానని, ఏ ప...