Hyderabad, జూలై 7 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి నగను మీనా కొట్టేయాలని చూసిందని సురేంద్ర, శోభన నిందలు వేస్తారు. ఆ మాటలు విన్న ప్రభావతి, కామాక్షి గదిలోకి వెళ్లారు. కూతురు చైను దొంగతనం చేస్తోంది. కట్టుకున్న వాడికి కష్టపడి కొనివ్వలేడని ఇలా చేసిందని సురేంద్ర అంటాడు.

ఇంకా నా కూతురు దగ్గర ఏమేం దొంగతనం చేశావో. దొంగలతో బతుకుతున్నానని తనకు తెలియదు కదా అని శోభన నానా మాటలు అంటుంది. దాంతో మీనా ఏడుస్తూ పరుగెత్తుకెళ్లి బాలుపై వాలుతుంది. ఏమైందని అంతా అడుగుతారు. ఇంతకంటే మంచి అవకాశం దొరకదు అని శోభన, సురేంద్ర అనుకుంటారు. నీ భార్య ఒక దొంగ అని సురేంద్ర అంటాడు.

నా కోడలు దొంగ ఏంటీ, తను ఎప్పటికీ చేయదు. తన చేతిలో చైన్ ఉన్నప్పుడు నేను పట్టుకున్నాను, నీ భార్య కూడా చూసిందని సురేంద్ర అంటాడు. చేతిలో చైన్ ఉంటే దొంగతనం చేసినట్లా అని కామాక్...