Hyderabad, సెప్టెంబర్ 4 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు, మీనా మొదటి పెళ్లి రోజుకు మౌనిక, సంజును పంపించమని సంజు తల్లి సువర్ణకి చెబుతుంది సుశీల. దానికి సువర్ణ ఒప్పుకుంటుంది. ఎందుకు అలా చెప్పారు అని మౌనిక అంటే.. సంజును నేను ఒప్పిస్తానని సువర్ణ అంటుంది.

ఒకరి చెడు గురించి ఆలోచించేవాడు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు. సంజును వదిలేసి మీ వాళ్లతో ఎంత సంతోషంగా గడపాలో అది ఆలోచించు అని సువర్ణ అంటుంటే ఇంతలో సంజు వచ్చి సంతోషం అంటున్నారేంటీ. ఏంటీ అని అడుగుతాడు. దాంతో సువర్ణ బాలు, మీనా పెళ్లిరోజు గురించి సువర్ణ చెబుతుంది. నాకు ఎవరు ఫోన్ చేయలేదే. వాళ్లకు మర్యాద తెలుసా. అల్లుడికి ఫోన్ చేసి చెప్పాలని తెలియదా అని సంజు అంటాడు.

వాళ్లు నీకు ఫోన్ చేశారట, కానీ కలవలేదట. అప్పటికీ నీ గురించి అడిగారు. కానీ, నువ్వే లేవు. కావాలంటే నువ్ ఒక్కదానివే వె...