Hyderabad, సెప్టెంబర్ 24 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 517వ ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. కొడుకును చూడటానికి రోహిణి హాస్పిటల్ కు వెళ్లడం, అక్కడ బాలు, మీనా ఆమెను నిలదీయడం, ఇంట్లో చింటూ గురించి చెప్పేస్తానని తల్లితో రోహిణి చెప్పడం, చివరికి చింటూ ఇంటికే వచ్చినట్లుగా కలగనడంలాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 24) ఎపిసోడ్ షాపులో మనోజ్‌కు రోహిణి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు వచ్చేలా చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడదామని మనోజ్ అనడంతో రోహిణి క్లాస్ పీకుతుంది. చెత్తగా ఉంది ఐడియా.. పాత ఓనర్ క్వాలిటీ చూసే వచ్చారు.. ఇప్పుడు తెలిస్తే బిజినెస్ మునుగుతుందని ఆమె చెబుతుంది.

అటు మనోజ్ పక్కన ఉండగానే రోహిణికి తల్లి ఫోన్ చేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దని ఎన్న...