Hyderabad, జూలై 17 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మలేషియా మామయ్య, రోహిణితో వెళ్లి ఆస్తులు విడిపించుర మనోజ్ అని ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి సైగ చేయడంతో వద్దు, మనోజ్ రావడానికి వీళ్లేదు అని మటన్ కొట్టు మాణిక్యం అంటాడు. మనోజ్ అక్కడికి వస్తే మలేషియా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో మా బావకు సంబంధించిన వాళ్లు కనిపిస్తే అరెస్ట్ చేస్తున్నారు. నేను పారిపోయి ఇండియా వచ్చానంటాడు మాణిక్యం.

పాప ఆరోగ్యం బాగా చూసుకో. వీళ్లంతా నిన్ను బాగా చూసుకుంటారు. మీ నాన్న గురించి ఏం తెలిసిన నేను వచ్చి చెబుతాను అని మాణిక్యం వెళ్లిపోతాడు. తర్వాత బాలు డౌట్ పడితే ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధం చెబుతారా. రోహిణి అసలే ఏడుస్తుందని మీనా అంటుంది. ఇంతలో ప్రభావతి వస్తే మీనా కాఫీ ఇస్తుంది. కానీ, కాఫీ తీసుకోకుండా నెట్టేస్తుంది ప్రభావతి.

ఏ దెయ్యం పట్టిం...