Hyderabad, అక్టోబర్ 1 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 522వ ఎపిసోడ్ మొత్తం రోహిణి, చింటూ, బాలు, ప్రభావతి చుట్టే తిరిగింది. చింటూ, సుగుణను తిట్టిన అత్త ప్రభావతికి రోహిణి క్లాస్ పీకడం, హాస్పిటల్లో రోహిణిని చింటూ అమ్మా అని పిలవడం, అది మీనా, బాలు వినడంలాంటి సీన్లను ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (అక్టోబర్ 1) ఎపిసోడ్ రోహిణి కావాలని పాల గిన్నె పడేయడం అది కాస్తా రవి చూసే సీన్ తో మొదలవుతుంది. పైకి వెళ్లిన తర్వాత శృతితో రవి ఇదే చెబుతాడు. రోహిణి కావాలనే అలా చేసిందని, చింటూ ఇంట్లో ఉండటం ఆమెకు ఇష్టం లేదేమో అని అంటాడు. వాళ్ల రూమ్ లో ఉంటుండటం వల్ల ఇలా చేస్తుందేమో అని సందేహిస్తాడు.

అదే విషయం రోహిణిని నేరుగా అడుగుతానని శృతి వెళ్తుంది. రూమ్ విషయంలోనే ఇలా చేస్తున్నావా అని అడుగుతుంది. తాను మీనాతో మాట్లాడతానని అంట...