Hyderabad, ఆగస్టు 18 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో తన ఫ్రెండ్‌కు మంచి కండిషన్ ఉన్న సెకండ్ హ్యాండ్ కారు చూడాలని బాలును పిలిపిస్తాడు పొలిటిషియన్. మంచి కారే చూపిస్తానని బాలు చెబుతాడు. దాంతో ముగ్గురు ఇదివరకు బాలుకు మీనా కొనిచ్చిన షాప్ దగ్గరికి వెళ్తారు.

మరోవైపు అదే షో రూమ్ దగ్గర కారు కొనడానికి మనోజ్ ఉంటాడు. మనోజ్‌కు ఏది నచ్చకపోవడంతో ఓనర్ చిరాకుపడతాడు. తన భార్య రావాలని రోహిణికి కాల్ చేస్తూ బయటకు వెళ్లిపోతాడు. ఇంతలో బాలు వాళ్లు వచ్చి లోపలికి వెళ్తారు. మనోజ్ దగ్గరికి రోహిణి వచ్చి ఇప్పుడెందుకు కారు అంటుంది. మనోజ్ నచ్చజెప్పుతాడు. మనోజ్‌కు నచ్చిన కారే పొలిటిషియన్‌కు నచ్చుతుంది.

ఓ బిజినెస్ మ్యాన్‌కు నచ్చిందని ఓనర్ చెబితే అతనితో బాలు మాట్లాడతనంటాడు. మనోజ్‌ను చూసి నువ్వా.. నువ్ ఏం బిజినెస్ చేస్తున్నావురా. పల్లీల వ్యాపారమా అని ఓ...