భారతదేశం, డిసెంబర్ 1 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు తీసుకొచ్చిన నిమ్మకాయ గురించి, తమకు ఏదో అవుతుందని భయమేస్తుందని, దాని నుంచి బయటపడే మార్గం చెప్పమని కామాక్షికి చెబుతుంది ప్రభావతి. నాకు తెలిసిన స్వామిజీ ఉన్నాడు. రేపు ఉదయమే రండి అని ధైర్యం చెప్పి కాల్ కట్ చేస్తుంది కామాక్షి. ఫోన్ స్విచాఫ్ పెట్టుకుంటుంది.

మరుసటి రోజు ఉదయం ఆరున్నరకే మనోజ్ రెడీ అవ్వడం చూసి రోహిణి షాక్ అయి అడుగుతుంది. నిజం చెప్పకుండా ప్రభావతి, కామాక్షి ఇద్దరిని డ్రాప్ చేయాలట అని చెబుతాడు. తనను కూడా పార్లర్ దగ్గర డ్రాప్ చేయమని రోహిణి అడిగితే కుదరదని చెబుతాడు మనోజ్. బయట ప్రభావతి ఎదురుచూచ్తుంది. ఇంతలో సత్యం వచ్చి ఎక్కడికి అని అడుగుతాడు.

ప్రభావతి చెప్పకుండా తప్పించుకుంటుంది. బాలు వచ్చి సెటైర్లు వేస్తాడు. ఇంతలో మనోజ్ వస్తాడు. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తున...