Hyderabad, జూలై 18 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లోవాళ్లకు కెనడా వెళ్లాలని, రూ. 14 లక్షలు కావాలని అని మనోజ్ అడుగుతాడు. అంత ఖర్చు పెట్టి వెళ్లడం ఎందుకు. ఇక్కడే ఏదైన చిన్న పని చూసుకుంటూ మెల్లిగా ఎదగొచ్చు కదా అని మీనా అంటుంది.

అంటే నీలా పూలు కట్టాలా నేను. నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా నీకు. అసలు చెబితే అర్థమవుతుందా అని మీనాను అవమానిస్తాడు మనోజ్. లక్షలు మింగిన డిగ్రీరా నీది అని సెటైర్ వేస్తాడు బాలు. ఇప్పటికే నీకు చాలా చేశాను. ఇక నా వల్ల కాదు అని సత్యం అంటాడు. ఇల్లు ఉంది కదా. తాకట్టు పెట్టమని మనోజ్ అడుగుతాడు. ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు అని ప్రభావతి అంటుంది.

కెనడా జాబ్ వస్తే అంతకుముందు తీసుకుంది, ఎప్పుడు తీసుకుంది తిరిగి ఇస్తానని మనోజ్ అంటాడు. ఇంతలో వచ్చిన రోహిణి ఏమైందని అడిగితే ఇల్లు తాకట్టు గురించి చెబుతారు. తెలియ...