Hyderabad, జూన్ 5 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో పూలదండలు అల్లడాన్ని మనోజ్‌తో ఫొటోలు తీయిస్తాడు సత్యం. మనోజ్‌కు సత్యం డైరెక్షన్ చేస్తూ అన్ని కవర్ చేయాలని చెబుతాడు. ఏంటీ ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డ్‌కు పంపాల అని ప్రభావతి అంటుంది. 500 పూలదండలు కట్టడం రికార్డే అని సత్యం అంటాడు. ఇన్ని పూలు మీనా పెళ్లిలో కూడా కట్టలేదని బస్తీ ఆమె అంటుంది.

సుమతి నీ పెళ్లిలో కడదాం. చదువు తర్వాత పెళ్లేగా అని బస్తీ ఆమె అంటే.. లేదు. జాబ్ చేస్తానని సుమతి అంటుంది. జాబ్ చేయకపోతే అత్తారింట్లో పని మనిషిలా చూస్తారు అని బస్తీ ఆమె అంటుంది. చూశావా అది నన్నే ఇన్‌డైరెక్ట్‌గా ఎలా అంటుందో అని రోహిణితో అంటుంది ప్రభావతి. బస్తీ వాళ్లతో సత్యం సరదాగా మాట్లాడుతాడు. ఒక అమ్మాయి స్పీడ్‌గా పూలు కడితే సత్యం మెచ్చుకుని పెళ్లి అయిందా అని అడుగుతాడు.

లేదని ఆమె చ...