Hyderabad, మే 26 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ జాబ్ గురించి ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. సత్యం దగ్గితే.. ఇంకా దగ్గు తగ్గనట్టుంది. మంచి నీళ్లు ఇవ్వమంటారా అని మీనా అంటే.. వద్దు. మీ అత్తయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఉంది. తనకు ఇవ్వు అని సత్యం అంటాడు. దాంతో మీనా నవ్వుతుంది.

విన్నావా పార్లరమ్మా రూ. 14 లక్షలు అంట. ఈ తల్లీకొడుకులు మలేషియా మీద పడతారేమో జాగ్రత్త అని బాలు అంటాడు. దాంతో రోహిణి వెళ్లిపోతుంది. సత్యం తెగ నవ్వుతాడు. ఎన్నడు లేనిది ఇంత నవ్వుతున్నారేంటీ అని బాలు అంటాడు. నవ్వు ఆపుకోవడం నా వల్ల కావట్లేదురా. ఇంతలో ఈ తల్లీకొడుకులు ఎంతలో ఎంత పెద్ద సినిమా చూపించేసార్రా అని సత్యం అంటాడు. బాలు ప్రేమగా చూస్తూ ఇలాగే నవ్వుతుండాలని అంటాడు.

ప్రభావతి మీద కౌంటర్స్ వేస్తాడు బాలు. సత్యం, బాలు, మీనా నవ్వుతారు. మనోజ్, ప్రభా...