Hyderabad, ఏప్రిల్ 28 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణికి మాజీ ప్రియుడు వర్ధన్ డబ్బుల గురించి వాయిస్ మెసేజ్ పెడతాడు. అది రోహిణి వింటున్నప్పుడే వచ్చిన ప్రభావతి ఏంటని అడుగుతుంది. దాంతో మలేషియా మావయ్య భార్య గురించి అని కవర్ చేస్తుంది రోహిణి. ఆ తర్వాత ఇద్దరు మీనాకు బాలు తెచ్చిన బంగారం గురించి మాట్లాడుకుంటారు.

3 గ్రాముల బంగారం తెచ్చి కిలో బంగారం తెచ్చినట్లు మీనా ఫీల్ అవుతుందని ప్రభావతి అంటుంది. మీ ఫీల్ అయేంత బంగారం ఏం తీసుకొచ్చాడు పుస్తెలే కదా. ఇన్నిరోజులు ఏమి లేనట్లే ఉన్నారు. ఇంత సడెన్‌గా ఎలా తీసుకొచ్చారు. మీనా షాప్ పెట్టిందిగా. ఎప్పుడు చూసిన కస్టమర్స్ చాలా మందే ఉంటున్నారు. ఆ పూల మీద సంపాదించిన డబ్బే ఇచ్చుంటుంది అని రోహిణి అంటుంది.

బాలు పరువు నిలబెట్టాలని, మనోజ్ కంటే గొప్పవాడు అనుకోవాలని ఇలా చేసి ఉంటుంది అని మీనాను ...