Hyderabad, జూన్ 2 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మౌనికతో బాలుపై ఉన్న కోపం గురించి చెబుతుంది మీనా. తాళి నాకు ఉరితాడులా కనిపించేది. అదే ఇప్పుడు పవిత్రంగా కనిపిస్తుంది. ఆయన ఇలా ఉండటానికి ఏదో కారణం ఉంది అని మీనా అంటే.. అన్నయ్యకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ దక్కలేదు అని మౌనిక అంటుంది.

ప్రతి ఒక్కరు మారడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకుని అర్థం చేసుకుంటే, అలాంటి భార్య దొరికినందుకు ఎవరైన మారుతారు. ఎప్పటికైనా మారక తప్పదు అని మీనా అంటుంది. అంటే నా భర్త ప్రవర్తన వెనుక ఏదైనా కారణం ఉండుంటుందా. ఆయన అలా మారడానికి ఏవైనా పరిస్థితులు కారణమా అని మౌనిక సంజు గురించి ఆలోచిస్తుంది.

నీతో మాట్లాడుతుంటే నాకు ప్రశాంతంగా ఉంది. ఇందుకేనేమో నిన్ను కనిపించేలా చేశాడు దేవుడు అని మీనా అంటుంది. లేదు వదినా అల్లకల్లోలంగా ఉన్న నా మనసును ప్రశాం...