Hyderabad, మే 12 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రాజేష్ తన ఫ్రెండ్స్‌తో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో గుణ వస్తాడు. నేను ఇప్పుడు వచ్చింది అసలు కోసం. మిమ్మల్ని వడ్డి అడిగితే మనుషులను పెట్టి కొట్టిస్తున్నారుగా. మీతో వ్యాపారం చేయలేను. అందుకే, అసలు వడ్డీ చెల్లించండి అని గుణ అంటాడు.

ఇంత సడెన్‌గా అడిగితే ఎలా అని రాజేష్ అంటాడు. సడెన్‌గా ఏం కాదు 24 గంటల టైమ్ ఇస్తున్నా. ఒక్కరోజులో అసలు ఇవ్వండి. లేకుంటే మీ కారులు తీసుకెళ్తా. నా డబ్బులు నాకు కావాలి. లేదా మీ కారులు కావాలి. మీరో ఆలోచించుకోండి. మీ ఆబద్భాందవుడు ఉన్నాడుగా. వాడికి చెప్పుకోండి అని గుణ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఛ.. బాలు గాడు ఏంట్రా ఇలా తయారైంది అని ఒకతను అంటాడు.

వాడు ఏం చేశాడురా. గుణను వాడు ఎందుకు కొట్టాడో తెలిసుగా. మళ్లీ వాడిని అంటారేంట్రా అని రాజేష్ అంటాడు....