Hyderabad, జూన్ 13 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి కోసం మనోజ్ బ్యూటి పార్లర్‌కు వస్తాడు. బ్యూటి పార్లర్ మీద అమ్మ పేరు లేకపోవడం చూసిన మనోజ్ షాక్ అవుతాడు. ఇంతలో రోహిణి వస్తే.. పార్లర్ అమ్మ పేరు మీద ఉండాలిగా. లేదేంటీ అని అడుగుతాడు మనోజ్.

నాకు ఈ బిజినెస్‌లో మంచి ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది. నేను కావాలనే ఈ కంపెనీ వాళ్లే నన్ను అప్రోచ్ అయ్యారు. మనం ఓకే అంటే వాళ్లు మనతో మెర్జ్ అవుతారు. ఇప్పుడు ఫ్రాంచైజీకి ఇచ్చాం. ఇప్పడు అందులో మనం పార్టనర్. దాంతో మంచి పేరు వస్తుంది, లాభాలు ఎక్కువస్తాయి, డబ్బు కూడా వస్తుందని రోహిణి చెబుతుంది. దాంతో నేను బిజినెస్ పెట్టుకోడానికి కూడా ఉపయోగపడుతుంది అని మనోజ్ అంటాడు.

ఆంటీ పేరు మార్చడం నాకు బాధగా ఉంది గానీ తప్పలేదు అని రోహిణి అంటుంది. దాంతో మనోజ్ వెళ్లిపోతాడు. ఇప్పుడు ఈ విషయం మీ అత్తయ్యకు తెల...