Hyderabad, జూన్ 12 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలుకు కారు కొనివ్వాలని అనుకుంటున్నట్లు రాజేష్‌తో అంటుంది మీనా. నేను గౌరవంగా బతికేలా చేశారు. ఆయనకు ఇప్పుడు ఆయన గౌరవం పోయేలా ఉందని మీనా అంటుంది. కొత్త కారు అంటే పది లక్షలు అవుతుంది. సెకండ్ హ్యాండ్ అయితే తక్కువలో దొరుకుతుంది అని రాజేష్, అతని ఫ్రెండ్ అంటారు.

బాలు ఆటో తీసుకోకముందు ఒక కారు చూశాడు. దానికి 3 లక్షలు అవుతుంది. డబ్బుల్లేక ఆగిపోయాడు. ముందు లక్షనర కట్టి మిగతాది ఈఎమ్ఐ కడితే సరిపోతుంది అని రాజేష్ అంటాడు. సరే, ఇది ఆయనకు చెప్పకు అని మీనా అంటే.. బాలుకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నావా అని రాజేష్ అంటాడు. నాకు పూలకొట్టు పెట్టి ఇచ్చినట్లు రిటర్న్‌గా సర్‌ప్రైజ్ ఇస్తా అని మీనా అంటుంది.

మీనా, రాజేష్ వాళ్లు వెళ్లి కారు చూస్తారు. కారు మూడు లక్షలు డౌన్ పేమెంట్ 80 వేలు కట్టమంటాడ...