Hyderabad, జూన్ 16 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణిని అత్తయ్య ఏమనలేదేంటి అని మీనా అంటుంది. లోపల కోపాన్ని అణుచుకుంది. కోరి తెచ్చుకున్న కోడలు కదా వెనకేసుకొస్తుంది అని బాలు అంటే ఏమోనండి అని మీనా వెళ్లిపోతుంది. ఛ.. నాన్న అంత నీవల్లే. ఇప్పుడు పార్లరమ్మా ఎలా తప్పించుకుందో. కానీ, అమ్మ సైలెంట్‌గా వెళ్లిందంటే నాకు ఏదో తేడా కొడుతుంది అని బాలు అంటాడు.

ఇన్నాళ్ల నుంచి కాపురం చేస్తున్న నాకే అర్థం కాలేదు మీకేం అర్థమవుతుందిరా అని సత్యం అంటాడు. మరోవైపు గదిలో ప్రభావతి కోపంగా కూర్చుని ఉంటుంది. రోహిణి భయపడుకుంటూ వస్తుంది. తలుపు మూయమని చెబుతుంది ప్రభావతి. నేనే ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను అని రోహిణి అంటుంది.

ఎప్పుడు. నీ కళ్లకు ఈ ప్రభావతి వెర్రిదానిలా కనిపిస్తున్నానా. అమాయకురాలిలా నటించకు నాకు చెప్పకుండా ఆ పార్లర్ పేరు మార్చే అధిక...