Hyderabad, ఆగస్టు 2 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో మీనా, బాలు బంధాన్ని చూసి ఆలోచిస్తుంటాడు మనోజ్. ఇంతలో రోహిణి వచ్చి ఏమైందని అడుగుతుంది. మీనా, బాలు ఒకరినొకరు ఎంతో అర్థం చేసుకుంటున్నారు, శ్రుతి రవి కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు రవి రెస్టారెంట్ పెడతానంటే వాళ్ల మావయ్య వెంటనే డబ్బు అరెంజ్ చేస్తాడు అని మనోజ్ చెబుతాడు.

నేను బిజినెస్‌లో బాగా ఎదుగుతానని నాకు నమ్మకం ఉంది. మీ నాన్నను డబ్బు అరెంజ్ చేయమని చెప్పొచ్చుగా అని రోహిణిని మనోజ్ అంటాడు. ఆయన జైలులో ఉన్నారుగా. అసలు నువ్ నన్ను డబ్బు చూసి ప్రేమించావా, నన్ను చూసి ప్రేమించావా. నువ్ ప్రతిసారి డబ్బు గురించి అడిగితే నాకు బాధేస్తుందని రోహిణి చెబుతుంది.

దాంతో రోహిణిని మనోజ్ బతిమిలాడుతాడు. నిన్ను చూసే ప్రేమించానని చెబుతాడు. అసలు మావయ్య నీకు ఇచ్చిన డబ్బును నీ నుంచి కొట్టేసి...