Hyderabad, అక్టోబర్ 5 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో బాలు ఇంట్లోంచి మీనా వెళ్లిపోతుంది. మీనా కోసం అంతా ఎదురుచూస్తుంటారు. ఎంతకీ మీనా రాకపోవడంతో ప్రభావతి అరుస్తుంది. నేను తమాషాగా అన్నదాన్ని పట్టుకుని ఇంట్లోవాళ్లు మాటలు అన్నారంటా. దానికి వెళ్లిపోయినట్లు ఉందని బాలు అంటాడు.

అది పని తప్పించుకోడానికి వెళ్లిపోయింది. అది లేకపోతే ఇల్లే గడవదా. రోహిణి నువ్వు వంట చేయు. అది లేకున్నా మనం వండుకోగలం అని నిరూపించాలి అని ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి వంట వండటానికి వెళ్లిపోతుంది. మీనాకు బాలు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. దాంతో మీనా చెల్లెలు సుమతికి బాలు కాల్ చేస్తాడు.

కాల్ చేసి మీనాకు ఫోన్ ఇవ్వమంటాడు బాలు. అక్క అక్కడుంటే ఇక్కడి నుంచి ఫోన్ ఎలా ఇస్తారు బావ అని సుమతి అంటుంది. దాంతో బాలు షాక్ అవుతాడు. అంటే మీనా మీ ఇంట్లో లేద...