Hyderabad, జూలై 26 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో బాలు పూలగంప అని మెచ్చుకోవడంతో మీనా మురిసిపోతుంది. ఇదేంటీ ఇలా మురిసిపోతుంది అని ప్రభావతి అనుకుంటుంది. ఇంతలో కిందకు వచ్చిన శ్రుతి కూడా చూసి ఏమైంది మీనా నీలోనే మురిసిపోతున్నావ్ అని అడుగుతుంది.

ఏం లేదు. కానీ, నీకు ఏం కావాలి అని మీనా అడుగుతుంది. మల్లెపూలు కావాలి అని అడిగి తీసుకున్న శ్రుతి తన చేయికి కట్టుకుంటుంది. మల్లెపూలను వాసన చూస్తూ పైకి వెళ్లిపోతుంది శ్రుతి. అదంతా అక్కడే ఉండి చూసిన ప్రభావతి షాక్ అవుతుంది. రవిగాడు అసలే మెతక. ఈ పిల్లతో ఎలా వేగుతాడో అని మనసులో అనుకుంటుంది ప్రభావతి.

తర్వాత పైకి వెళ్లిపోతుంది ప్రభావతి. రోహిణి దగ్గరికి మనోజ్, శ్రుతి దగ్గరికి రవి వెళ్తారు. రవి, శ్రుతి రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. మనోజ్ చేసిన పనివల్ల తన తల కొట్టేసినట్లు అవుతుందని ...