Hyderabad, జూన్ 15 -- తెలుగు బుల్లితెర టాప్ ఛానెల్స్‌లలో స్టార్ మా ఒకటి. స్టార్ మా ఛానెల్స్‌లో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. వాటిలో ఒకటే గుండె నిండా గుడి గంటలు సీరియల్. స్టార్ మా, జియో హాట్‌స్టార్ ఓటీటీలలో గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ స్ట్రీమింగ్ అవుతుంటుంది.

అచ్చమైన తెలుగు కుటుంబ కథా నేపథ్యంతో సాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ఆదరణను సాధించింది. సీరియల్‌లోని పాత్రలు నిజ జీవితంలో చాలా వరకు ప్రతిబింబించేలా ఉంటాయి. ఇక ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా చేసిన మీనా పాత్ర మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ పాత్ర పోషించిన కన్నడ భామ అమూల్య గౌడ మరింత పాపులర్ అయింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలు, మీనా పాత్రలు చాలా మందికి ఫేవరెట్. వీటితోపాటు మంచి వ్యక్తిత్వం, హుందాతనంతో సత్యం పాత్ర ఉంటుంది. ఈ రోల్ కూడా ప...