భారతదేశం, అక్టోబర్ 26 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో తండ్రి సత్యం కొట్టడంతో బాలు తాగి ఇంటికొస్తాడు. మీనా అన్నం తీసుకొచ్చేందుకు వెళ్తుంది. ఇంతలో బాలు పడబోతుంటే సత్యం వచ్చి పట్టుకుంటాడు. నేను అన్నందుకేగా తాగి వచ్చావ్ అని సత్యం అంటాడు. దానికి కాదని చెప్పు మీనా అని బాలు అంటాడు.

ఆ మాట నాకే చెప్పొచ్చుగా. నాకు చెప్పనంత పరాయి వాన్ని అయిపోయానా అని సత్యం కుమిలిపోతాడు. అలా ఏం లేదు నాన్న అని బాలు అంటాడు. ఇంతలో ఇంట్లోవాళ్లంతా వస్తారు. బాలు తాగొచ్చాడని ప్రభావతి గొడవ చేస్తుంది. ఫుల్లుగా తాగి ఇంటికొచ్చాడు. కుక్క తోక వంకరేగా అని ప్రభావతి అంటుంది.

ఇందాక ఇంత పెద్ద గొడవ చేశాడు. ఇప్పుడు ఇలా బాలు మళ్లీ తాగొచ్చాడు అని శ్రుతి అంటుంది. గొడవ అంతా మీ అమ్మతోనేగా జరిగింది. మీ అమ్మ మాకు డబ్బులివ్వడమేంటీ డబ్బుడమ్మా అని బాలు అంటాడు. మనం...