Hyderabad, ఆగస్టు 31 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో బాలు చూపించిన ఫర్నిచర్ షాప్ సత్యం కుటుంబం మొత్తానికి నచ్చుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఫర్నిచర్ షాప్‌కి ఏ పేరు పెట్టాలో మనోజ్, రోహిణి డిస్కస్ చేసుకుంటుంటారు. మీ నాన్న పేరు పెడతాం అని రోహిణిని మనోజ్ అంటాడు.

డబ్బులు మా నాన్న ఇవ్వలేదుగా అని రోహిణి అంటే.. అలా అయితే కల్పన పేరు పెట్టాలి అని మనోజ్ అంటాడు. దాంతో మనోజ్‌ను ఒక్కటి కొడుతుంది రోహిణి. మనోజ్ కిందపడతాడు. కల్పన పేరు పెట్టాలనడానికి సిగ్గు లేదా అని రోహిణి అంటే సరదాగా అన్నాను అని మనోజ్ అంటాడు. మనోజ్ కింద పడిన సౌండ్ విని బాలు అన్న గదికి వస్తాడు.

షాప్‌కు అత్తయ్య పేరు ప్రభావతి అని పెడదామని రోహిణి అంటుంది. వద్దు. అమ్మ పేరు పెడితే కలిసి రాదు. నీ పార్లర్, మీనా పూల కొట్టు రెండు పోయాయి. కావాలంటే మంచి చీర కొనిద్దాం. ...