భారతదేశం, జనవరి 10 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో డిగ్రీలో క్లాస్ టాపర్ వచ్చిన సుమతి అక్క మీనాతో కలిసి మెటర్నిటీ హాస్పిటల్‌లో అకౌంటెంట్ జాబ్ కోసం వెళ్తుంది. అక్కడికే రోహిణి రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం చెకప్‌కు వస్తుంది. పూల ఆర్డర్ వచ్చిందని మీనా వెళ్లిపోతుంది.

హాస్పిటల్‌లో రోహిణిని సుమతి చూస్తుంది. ఇంటర్వ్యూ తర్వాత అక్క మీనాకు కాల్ చేసి తనకు జాబ్ వచ్చిందని, ఆరు నెలల తర్వాత పర్మనెంట్ చేస్తారని చెబుతుంది సుమతి. దాంతో మీనా తెగ సంతోషిస్తుంది. తర్వాత మెటర్నిటీ హాస్పిటల్‌కు రోహిణి కూడా వచ్చిందని, తనను చూశానని సుమతి చెబుతుంది.

అది ప్రసవం కోసం వచ్చే హాస్పిటల్ కదా అని మీనా అంటుంది. ఏమో తెలియదు, నేను మాట్లాడిద్దామనుకునేసరికే ఇంటర్వ్యూకి పిలిచారు. వెళ్లాను అని సుమతి చెబుతుంది. ఫోన్ కాల్ కట్ చేసిన తర్వాత అక్కడికి రోహ...