Hyderabad, జూలై 19 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో శ్రుతిని దొంగతనం నింద నుంచి బాలు కాపాడుతాడు. నల్ల పూసల ఫంక్షన్‌లో జరిగిన గొడవ, సురేంద్ర చేసిన ప్లాన్ గురించి మొత్తం చెబుతాడు బాలు. అలాగే, మధ్యలో రవి ఏం తప్పు చేశాడని, వాడికి ఎందుకు దూరంగా ఉంటున్నావని అడుగుతాడు బాలు.

ఎలుకలు, బొద్దింకలు తిరిగే రూమ్‌లో చాలా ఇబ్బందులు పడుతూ రవి ఉంటున్నాడని బాలు చెబుతాడు. దాంతో శ్రుతి కరిగిపోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రవి తనవల్ల అలా అవస్థలు పడటం చూల్లేకపోతుంది. నువ్ మా నాన్నను కొట్టినందుకు నాకు నీ మీద కోపంగానే ఉంది. కానీ, నువ్ మీనాను దొంగ అన్నందుకు కొట్టావ్ కాబట్టి అర్థం చేసుకుంటున్నాను. ఇంటికి రావడానికి ఆలోచిస్తాను అని శ్రుతి చెబుతుంది.

దాంతో నీకు చెప్పాల్సింది చేయు డబ్బుడమ్మా. కానీ, మీ కోసం మా అమ్మ నాన్న బెంగ పెట్టుకున...