Hyderabad, జూన్ 14 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో పార్లర్‌ను ఫ్రాంచైజీకి ఇచ్చినట్లు, అందుకే ప్రభావతి పేరు పార్లర్‌పై నుంచి తొలగించినట్లు ఇంట్లో మనోజ్ అందరికి చెబుతాడు. దాని వల్ల చాలా లాభాలు వస్తాయని, డబ్బు సంపాదించొచ్చని అంటాడు.

అదంతా విన్న ప్రభావతి షాక్ అయిపోతుంది. రోహిణిని నిజమా అని అడిగితే.. అవును. నేనే సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నాను. కానీ, మనోజ్ చెప్పేశాడు. అది చాలా పెద్ద కంపెనీ. మనకు చాలా లాభాలు వస్తాయని రోహిణి అంటుంది. మీనా మాత్రం తన పూలకొట్టు పేరు ప్రభావతి తప్పా ఇంకేం పెట్టనని అంటుంది. రోహిణి ఏం చేసిన మంచికే చేస్తుంది, అన్ని లాభాలు రావడం అనేది మంచి విషయమేగా అని ప్రభావతి అంటుంది.

రోహిణిపై ప్రభావతి సీరియస్ అవుతుందని అంతా అనుకుంటే ప్రభావతి కూల్‌గా ఏం అనకపోయేసరికి అంతా షాక్ అవుతారు. అందరిముందు రోహిణిని ఏ...