భారతదేశం, డిసెంబర్ 18 -- గుండెపోటు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే పెద్ద రక్తనాళాల్లో అడ్డంకులు (Blocks). కానీ, కంటికి కనిపించని అతిచిన్న రక్తనాళాల్లో సమస్య ఉంటే గుర్తించడం చాలా కష్టం. ఇలాంటి క్లిష్టమైన సమస్యను కూడా అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించేలా మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను రూపొందించారు. వైద్య రంగంలో ఇది ఒక అద్భుతమైన ముందడుగు అని నిపుణులు ప్రశంసిస్తున్నారు.

కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ (CMVD) అనేది గుండె కండరాలకు రక్తాన్ని చేరవేసే అతిచిన్న రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి. ఏటా సుమారు 1.4 కోట్ల మంది గుండెనొప్పితో ఆసుపత్రులకు వస్తుంటారు. వీరిలో చాలా మందికి ఆంజియోగ్రామ్ (Angiogram) చేసినప్పుడు రిపోర్టులు 'క్లియర్' అని వస్తాయి. ఎందుకంటే ఆంజియోగ్రామ్ ...